మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుస విజయాలతో దూసుకుపోతున్న మెగాహీరో సాయిధరమ్ తేజ్ ప్రతి సినిమాలో తన అభినయంతో, డాన్సుతో ఆద్యంతం ప్రేక్షకుల మన్నలను పొందుతున్నాడు. ఇండస్ట్రీలోకి వచ్చి కొద్దికాలమే అయినా స్టార్ హీరోలకి ధీటుగా పేరుసంపాదించుకున్న ఈ యువ హీరో 'తిక్క' సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ కెరీర్‌కి కరెక్టుగా సరిపోతుందని భావిస్తున్నారు.
హీరోగా వచ్చినప్పటి నుండి తన జోష్‌తో ఎలాగైతే విన్నర్‌గా నిలుస్తున్నాడో అలాగే ఈ సినిమాకి 'విన్నర్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకి నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్‌లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుంది. థమన్ ఈ సినిమాకి మ్యూజిక్‌ని అందిస్తున్నాడు. ఇదిలావుంటే ఈ సినిమాలో బుల్లితెర అందాల భామ అనసూయ ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు సమాచారం. ఈ సాంగ్ ఈ సినిమా హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తుందనీ, అనసూయ క్రేజ్‌ను మరింత పెంచుతుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి అనసూయ పవన్ కళ్యాణ్ చిత్రంలో ఐటమ్ గర్ల్‌గా నటించాల్సి ఉండగా, అక్కడ కాదనీ సాయితో కలిసి నటించనుంది.