''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'' ఫేమ్ అంజలి ఇల్లు మార్చిందట. అంజలి ఆమధ్య 'గీతాంజలి' అనే దెయ్యం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి దెయ్యం ప్రధాన పాత్రలో సాగే సినిమాలో నటించి ఆకట్టుకున్న అంజలి దెయ్యం భయంతో ఇల్లు ఖాళీ చేసిందట. హైదరాబాదులోని గచ్చిబౌలి ప్రాంతంలోని నాగచైతన్య ఇంటికి పక్కనే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న అంజలి.. ఇంటికి సమీపంలో ఎక్కువ పిల్లులు తిరుగుతుండటాన్ని గుర్తించింది.
దీంతో ఆ ఇంట్లో దెయ్యాలేమైనా ఉన్నాయా? అనే అనుమానం ఆమెలో పెరిగింది. ఇందుకు తోడు అర్థరాత్రి పూట ఆ ఇంట్లో వింత శబ్ధాలు రావడంతో.. ఆ ఇంట్లో దెయ్యం వుందనే నిర్ణయానికి వచ్చేసింది. ఇక లాభం లేదనుకున్న అంజలి ఇంటిని ఖాళీ చేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేగాకుండా.. హైదరాబాదులో సొంత ఇల్లు కొనుక్కోవాలని కూడా నిర్ణయించుకుంది.