పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబోలో రూపుదిద్దుకోనున్న మూడో సినిమా కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలకు తర్వాత త్రివిక్రమ్-పవన్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల మాదిరిగానే, ఈ సినిమాలోను ఇద్దరు కథానాయికలు ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఎంపిక చేసుకున్నారు.
మరో కథానాయికగా అనూ ఇమ్మాన్యూయేల్‌ను తీసుకున్నారని టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. అనూ ఇటీవల విడుదలైన నాని 'మజ్ను' సినిమాలో నటించింది. ఈ సినిమాకిగాను అను 25 నుంచి 30 లక్షల వరకూ పారితోషికం అందుకుంటోందని టాక్. ఏదైతేనేమి.. మజ్ను తర్వాత అను పవన్ సరసన నటించే ఛాన్సు కొట్టేసింది.. లక్కీ గర్ల్ అని సినీ పండితులు అంటున్నారు.