అనుపమ ప్రేమలో రామ్ పోతినేని.. నిజమేనా?

గురువారం, 5 అక్టోబరు 2023 (10:51 IST)
Anupama Parameswaran and Ram Pothineni
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు సర్వసాధారణం. హీరోలు, హీరోయిన్లు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం, టాలీవుడ్‌లోనూ చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. 
 
ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రామ్ పోతినేని వంతు వచ్చింది. చిత్ర పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం, అనుపమ పరమేశ్వరన్, రామ్ పోతినేని ప్రేమలో ఉన్నారని టాక్. 
 
వీరిద్దరూ కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. 
అయితే ఈ వార్తలపై వారిద్దరూ ఇంకా స్పందించలేదు. 
 
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, రామ్ పోతినేని కలిసి వున్నది ఒక్కటే జిందాగ్, "హలో గురు ప్రేమ కోసమే" సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని అంటున్నారు. మరోవైపు, పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన డబుల్ ఇస్మార్ట్‌లో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు