బాహుబలి దేవసేన అనుష్క శెట్టి తన ప్రేమ గురించి ఓపెన్ అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆరో తరగతిలో ఓ అబ్బాయి ఐ లవ్ యూ చెప్తే.. ఆ వయసులో ప్రేమంటే ఏమో తెలియకపోయినా ఓకే చెప్పేసానని వెల్లడించింది. అది తనకు మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందని తెలిపింది. ఇంకా 2008లో ఓ వ్యక్తిని ప్రేమించానని.. ఆ ప్రేమ నుంచి బ్రేకప్ అయ్యిందని అనుష్క శెట్టి తెలిపింది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం అనుష్క వెల్లడించలేదు.
ఇకపోతే.. హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్క శెట్టి ఇద్దరు ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గతంలో చాలా వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఇద్దరూ కొట్టిపారేశారు. తాము మంచి స్నేహితులం మాత్రమే అని, తమ మధ్య ఎలాంటి ప్రేమ బంధం లేదని స్పష్టం చేశారు.
తమ పెళ్లి వార్తలను నవ్వుతూ కొట్టిపారేశారు. ఏజ్ 40 దాటినా వీరిద్దరూ పెళ్లి చేసుకోకపోవడంతో రకకరాల ఊహాగానాలు వచ్చాయి. కాగా అనుష్క ప్రస్తుతం ఘాటి చిత్రంలో నటిస్తున్నారు.
Anushka
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి (ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్), యూవీ క్రియేషన్స్ సమర్పణలో రూపొందిస్తున్నారు. ఇక ఖైదీ 2లో అనుష్క ఒక నెగిటివ్ టచ్ ఉన్న పాత్రను పోషించనున్నట్లు టాక్.