ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మధ్య చెడిందా..?

సోమవారం, 19 అక్టోబరు 2020 (13:30 IST)
అల.. వైకుంఠపురములో సినిమా తర్వాత మాటల మాంత్రికుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకున్నారు. ఈ సినిమాని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు. అయితే... కరోనా కారణంగా షూటింగ్స్ ఆగిపోవడం... ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో ఎన్టీఆర్‌తో మూవీ ఆలస్యం అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు.
 
ఇదిలా ఉంటే... మహేష్ బాబు త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. వీరిద్దరి మధ్య కథా చర్చలు జరగడం.. త్రివిక్రమ్ చెప్పిన స్టోరీకి మహేష్‌ ఓకే చెప్పడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
 
 అయితే... త్రివిక్రమ్ ఇలా మహేష్‌ బాబుతో సినిమా చేయాలనుకోవడంతో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత కేజీఎఫ్‌ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.
 
ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఎన్టీఆర్ - త్రివిక్రమ్‌కు చెడిందా..? అంటూ అనుమానాలు మొదలయ్యాయి. ప్రశాంత్ నీల్‌తో సినిమా చేసిన తర్వాత త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. కాస్త లేట్ అయినా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని అంటున్నారు. 
 
మరో విషయం ఏంటంటే... ఈ సినిమాలో ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్‌గా నటించనున్నారని.. దీనిని పాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నారని సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు