కాగా, ఈ అవార్డు వేడుకలను యావత్తు తెలుగు సినిమా మొత్తం కలిసి చేసుకునేలా ప్లాన్ చేయడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది. అగ్ర నిర్మాతలు ఈ విషయమై శ్రావణ శుక్రవారంనాడు చర్చించినట్లు తెలిసింది. దీనికి ముఖ్యమంత్రి సైతం హాజరయ్యేలా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వివిధ సినిమాలకు చెందిన యూనిట్ వినోదపార్టీలు నిర్వహిస్తున్నారు. అల్లు అర్జున్ తన టీమ్‌తోపాటు సన్నిహితులతో కలిసి ఈరోజు ఓ స్టార్ హోటల్లో పార్టీ ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటికే దక్షిణాది చలనచిత్ర రంగంనుంచి పలువురు అల్లు అర్జున్‌కు, రాజమౌళి తదితరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
శనివారంనాడు దిల్‌రాజు తన స్పందన తెలిపారు. , అల్లు అర్జున్, ఆర్.ఆర్.ఆర్. టీమ్‌కు పేరుపేరునా శుభాకాంక్షలు తెలిపారు. రాజమౌళికి ప్రత్యేకంగా కితాబిస్తూ, మీ వల్లే తెలుగు సినిమా ప్రపంచస్థాయిలో గర్వించే సినిమాగా నిలిచింది. ఇలా అందరికీ కంగ్రాట్స్ అంటూ మనం అందరం ప్రత్యేకంగా అభినందించుకోవాల్సిన సమయం వచ్చిందంటూ తెలిపారు.