బాబు బాగా బిజీ ద్వారా బాగా అందాలు ఆరబోసిన బోల్డ్ నటికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరూ చేయని రిస్క్ దర్శకుడు, నటుడు శ్రీనివాస్ అవసరాల చేశాడు. బాలీవుడ్‌లో అడల్ట్ కంటెంట్‌గా తెరకెక్కిన 'హంటర్' చిత్రాన్ని తెలుగులో బాబు బాగా బిజీ పేరుతో రీమేక్ చేశాడు. ఈ చిత్రంలో నటించిన హీరోయిన్లు శ్రీముఖి, తేజస్విని మడివాడ, మిస్త్రీ, సుప్రియ చాలా హాట్ హాట్‌గా నటించారు.
తొలుత ఈ సినిమాపై విమర్శలు వస్తున్నా.. అవన్నీ ఏమాత్రం అవసరాల పట్టించుకోకుండా ఏప్రిల్ 5న రిలీజ్ చేశాడు. రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాలో నటించిన ఏ నటులకు పెద్దగా పేరు రాలేదు కానీ బోల్డ్‌గా కుర్రకారుకి మత్తెక్కించేలా నటించిన సుప్రియకు మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చింది.