ఊరికోసం ఏదైనా చేయాలనే కాన్సెప్టుతో వచ్చిన మహేష్ బాబు 'శ్రీమంతుడు' సినిమా తర్వాత గ్రామాలను దత్తత తీసుకోవడం, ఊరి బాగు కోసం మంచి చేయడం లాంటివి చాలామంది ఆచరిస్తున్నారు. మహేష్ బాబు కూడా స్వయంగా దీన్ని ఆచరిస్తూ... అభిమానులు తన దారిలో నడిచేలా చేస్తున్నాడు. శ్రీమంతుడు సినిమా తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు రెండు గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్‌లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెంతో పాటు తెలంగాణలో సిద్దాపురం గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. ఈ రెండు గ్రామాల అభివృద్ధికి సంబంధించిన పనులను మహేష్ బాబు సతీమణి నమ్రత చూసుకుంటన్నారు. ఈ నేపథ్యంలో శ్రీమంతుడు కాన్సెప్ట్ చాలామందికి నచ్చేసింది. ఈ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేయడంతో పాటు హిట్ కొట్టేసింది.