పవర్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం "ఖుషి". సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. పవన్ సినీ కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రం. ఇందులో భూమిక హీరోయిన్. ఓ సన్నివేశంలో ఆమె నల్లచీర కట్టుకుని ప్రదర్శించిన నాభి అందాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఈ అమ్మడు పెళ్లి చేసుకుని, సినీ ఇండస్ట్రీకి దూరమైంది.
ఇటీవలి కాలంలో రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ అక్క, వదిన పాత్రల్లో మెప్పిస్తున్నారు. అయితే టాలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమాచారం మేరకు భూమికకు మరో మంచి అవకాశం దక్కిందట. అదేంటంటే ఓ స్టార్ హీరో సినిమాలో లేడీ విలన్‌గా. ఇంతకూ ఆ స్టార్ హీరో ఎవరని అనుకుంటున్నారా? నందమూరి బాలకృష్ణ.