భూమికకు ఆర్థిక ఇబ్బందులు.. ఎంసీఏలో నానికి వదిన లేదా అక్కగా నటిస్తుందట..

ఆదివారం, 18 జూన్ 2017 (10:43 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించి.. ఆపై అగ్ర హీరోయిన్‌గా మంచి పేరు కొట్టేసిన భూమిక.. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. సింహాద్రి, ఒక్కడు, ఖుషీ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో నటించిన భూమికా చావ్లా..  మిస్సమ్మ , అనసూయ లాంటి సినిమాలకి అవార్డ్స్ కూడా అందుకుంది.

ఆపై యోగా స్పెషలిస్ట్ రాథోడ్‌ని పెళ్లి చేసుకున్న భూమిక సినిమాల మీద ఆసక్తి తగ్గించింది. మొన్ననే ధోనీ సినిమాలో హీరోకి అక్కగా కనపడిన ఆమె పెద్ద పెద్ద క్యారెక్టర్‌లకి ఫిక్స్ అయినట్లు కనిపించింది. తాజాగా ఆసక్తికర చిత్రంలో భూమిక కీలక పాత్రలో నటిస్తోంది.
 
నేచురల్ స్టార్ నాని హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ''ఎంసీఏ''లో భూమిక ఓ కీలక పాత్ర పోషిస్తోంది. నానీతో ఈ సినిమాలో అక్కగా గానీ, వదినగానీ కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

నాని ప్రస్తుతం మాంచి ఫాంలో ఉన్న నేపథ్యంలో అతడి సినిమాలో భూమిక హైలైట్ అయితే.. భూమికకు మంచి రోల్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి