జూలై నుంచి బిగ్ బాస్-4 : కంటెస్టెంట్స్ వీరేనా?

శుక్రవారం, 22 మే 2020 (12:59 IST)
ప్రముఖ టీవీ చానెల్ స్టార్ మా ప్రతి యేడాది నిర్వహించే బిగ్ బాస్ నాలుగో సీజన్ జూలై నెలలో ప్రారంభించండం ఆనవాయితీగా వస్తోంది. గత మూడు సీజన్లూ ఇదే నెలలో ప్రారంభించారు. ఈ యేడాది కూడా ఇదే విధంగా జూలై నెలలోనే ప్రారంభించాలన్న గట్టి పట్టుదలతో స్టార్ మా యాజమాన్యం ఉంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా జోరుగా చేస్తోంది. అయితే, ఈ నాలుగో సీజన్‌కు హోస్ట్ ఎవరన్నది ఇంకా తేలలేదు. మొదటి మూడు సీజన్లకు అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, నానిలు హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ దఫా మాత్రం ఈ ముగ్గురితో పాటు.. మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో కరోనా కష్టాలతో ఎలాంటి సంబంధం లేకుండానే జూలై నెలలోనే నాలుగో సీజన్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. ఇందులోభాగంగా, కొందరు కంటెస్టెంట్స్‌ను కూడా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో కంటెస్టెంట్స్‌గా త‌రుణ్‌, వ‌ర్షిణి, మంగ్లీ, అఖిల్ స‌ర్తాక్ త‌దిత‌రులు ఉంటార‌ని తెలుస్తుంది. అన్న‌పూర్ణ స్టూడియోలోనే సీజ‌న్ 4 కూడా జ‌ర‌గ‌నుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు