అనుష్క శర్మతో లిప్ లాక్ సీన్ చేయనని తెగేసి చెప్పిన సల్మాన్... కారణం విరాట్ కోహ్లీయేనా?

మంగళవారం, 7 జూన్ 2016 (15:30 IST)
బాలీవుడ్ అంటే లిప్ లాక్స్‌కి కొదవుండదు. లిప్ లాక్స్ అంటేనే బాలీవుడ్ అని అంతా అనుకుంటారు. లిప్ లాక్స్ చేయడానికి హీరోలు నువ్వా నేనాని పోటీపడుతుంటారు. కుర్ర హీరోలు మాత్రం అదరచుంబనానికి ఎప్పుడూ సై అనే అంటారు. కానీ ఈ ముద్దు సీన్లకు ఖాన్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపట్లేదు. బాలీవుడ్ వీరుడు అమీర్ ఖాన్ ముద్దు సీన్లకి ఎప్పుడో ఓటేసి ఫేమస్ అయ్యాడు. ఇక కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ విషయానికొస్తే ''జబ్ తక్ హై జాన్''లో కత్రినాకైఫ్‌తో అదరచుంబనం చేసి పెదాలతో ఓ ఆట ఆడేసుకున్నాడు. 
 
తాజా సమాచారం ప్రకారం ముద్దు సీన్లకు దూరంగా ఉండేది బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మాత్రమే. బాలీవుడ్ పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా హీరోయిన్స్‌తో లిప్ లాక్ చేయలేదంటే నమ్ముతారా.... కాగా అలాంటి అరుదైన అవకాశం సల్మాన్‌ని వరిస్తే చేయనంటే చేయనని చెప్పడంతో దర్శకుడు ఆ సీన్‌ని మార్చేశారట. 
 
ఇదంతా సల్మాన్ లేటెస్ట్‌గా చేస్తున్న ''సుల్తాన్'' సినిమాలో ఈ సీన్ ఉందట. ఈ సినిమాలో అనుష్క, సల్మాన్‌ల మధ్య జరిగే ఓ రొమాంటిక్ సన్నివేశంలో ఈ ముద్దు సీన్ ఉంటుందట. అనుష్క శర్మతో ఓ ముద్దు సీన్ ఉండగా దర్శకుడు ఎంత చెప్పినా ఆ సీన్ చేయనంటే చేయనని చెప్పడంతో ఇకచేసేది లేక అదరచుంబనాన్ని మూతి ముద్దుతో సరిపెట్టుకున్నాడట. అసలు సల్మాన్ ఎందుకు ముద్దు సీనుకు వెనుకాడాడని దర్శకుడు తలబద్దలు కొట్టుకుంటున్నాడట. అనుష్క శర్మ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీతో క్రికెట్ మైదానాల్లో అనేక రకాలైన లిప్‌లాక్‌ కిస్‌లు పెట్టిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి