ప్రియమణి నడుముపై చెయ్యేసిన బోనీ కపూర్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

సెల్వి

గురువారం, 11 ఏప్రియల్ 2024 (11:57 IST)
Priyamani
ముంబైలో మైదాన్ సినిమా ప్రదర్శన సందర్భంగా నటి ప్రియమణిని అనుచితంగా తాకడంతో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ వివాదంలో చిక్కుకున్నారు. ఒక వైరల్ క్లిప్ కపూర్ ప్రియమణి వీపు, నడుముపై చేయి వేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంకా నెటిజన్లు అతని ప్రవర్తనను ఖండిస్తున్నారు. 
 
బోనీ కపూర్ ఇంతకు ముందు ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మోడల్ జిగి హడిద్, నటి ఊర్వశి రౌతేలాతో ఫోటోలు తీసిన సందర్భంగా వార్తల్లో చిక్కారు. 
 
తాజాగా ప్రియమణితో కలిసి ఫోటో దిగి వివాదంలో చిక్కారు. ప్రియమణితో బోనీ కపూర్ ప్రవర్తనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఆయనను తిట్టిపోస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు