దాదాపు పదేళ్ళ తర్వాత నటిస్తున్నా ఇంత పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఆహ్వానించడం మంచిపరిణామంగా పేర్కొన్నారు. ఓవర్‌సీస్‌లో ప్రీమియర్ షోకే రూ.6 కోట్లు దాటాయని తెలిపారు. ఇంతకుముందు చిరు ఫ్యాన్స్ ఇప్పుడు విదేశాల్లో ఉద్యోగరీత్యా అక్కడ సెటిల్ కావడం.. వారంతా ఆయనకు బ్రహ్మరథంపట్టడమే ఈ వసూళ్ళకు కారమని వివరించారు. ఆశ్చర్యం కల్గించే విషయం ఏమంటే.. అక్కడ కూడా కారు ర్యారీలతో భారీ హంగామా చేశారని పేర్కొన్నారు.
ఇకపోతే చిరంజీవి తదుపరి చిత్రం గురించి చెబుతూ... 151వ సినిమా రామ్ చరణ్ నిర్మాతగా ఉంటుందనీ, దర్శకుడు ఎవరనేది నిర్ణయం కాలేదన్నారు. 152 చిత్రం యేడాది ఆఖరుల్లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉండబోతుందని తెలిపారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో సినిమా ఉంటందనీ అది ఏకథ అనేది త్వరలో వెల్లడిస్తానని వివరించారు. హీరో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ.. ఖైదీ చిత్రాన్ని ఆయన ఇంకా చూడలేదనీ, తను షూటింగ్‌లో బిజీగా ఉండటమే కారణమన్నారు.