అన్నయ్య-తమ్ముడికి బాహుబలి భయం పట్టుకుంది. కాటమరాయుడుతో పవన్ కల్యాణ్, ఖైదీ 150తో మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఏడాది ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమౌతున్న వేళ.. వీరిద్దరికీ బాహుబలి2తో కాస్త భయం పట్టుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బాహుబలి2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవర్ స్టార్ కాటమరాయుడు మార్చిలో విడుదల కానుంది. అదే ఖైదీ 150 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలకు రెండు మూడు మాసాల్లోనే బాహుబలి రిలీజ్ అయితే కలెక్షన్లపై దెబ్బ తప్పదని సినీ పండితులు అంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను సొంతం చేసుకున్న బాహుబలి.. మెగాస్టార్ ఖైదీ, పవర్ స్టార్ కాటమరాయుడు సినిమాలను ఏవిధంగా దెబ్బతీస్తోందని ఫ్యాన్స్ జడుసుకుంటున్నారు. ఇప్పటికే భారీ మొత్తం బాలీవుడ్ రైట్స్‌ను పలికిన బాహుబలి-2కు దగ్గరలో తమ సినిమాలను రిలీజ్ చేయకూడదని నిర్మాతలు, దర్శకులు ప్లాన్ చేస్తున్నారు.
మిగతా హీరోలతో పాటు క్రేజీ హీరో పవన్ కళ్యాణ్ నయా మూవీ కాటమరాయుడుకి సైతం బాహుబలి 2 టెన్షన్ పట్టుకున్నట్టు సమాచారం. బాహుబలి 2 విడుదలకు నెల రోజుల ముందుగానే కాటమరాయుడును రిలీజ్ చేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు టాక్. సమ్మర్లో కాకుండా కాటమరాయుడిని బాహుబలి 2 ప్రభావంతో మార్చి 31న కాటమరాయుడును రిలీజ్ చేయాలని పవన్ భావిస్తున్నాడట. అప్పటికీ బాహుబలి 2 విడుదలకు నెల రోజుల గ్యాప్ ఉంటుంది కాబట్టి… కాటమరాయుడు మానియా పని చేస్తుందని పవన్ ఫీలవుతున్నట్లు తెలిసింది.
మరోవైపు తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన భారీ చిత్రం బాహుబలి. అలాంటి బాహుబలికి సీక్వెల్‌గా వస్తోన్న బాహుబలి 2 ప్రీ బిజినెస్ అదిరిపోతోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న ఖైదీ నంబర్ 150, బాహుబలి.. ఆంధ్రా రైట్స్ రికార్డ్‌ను చెరిపేసిందట.