చిరు సిస్టర్ రోల్‌కి ఇద్దరు హీరోయిన్లు పోటీ? (video)

బుధవారం, 14 అక్టోబరు 2020 (13:05 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళంను తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తతం ప్రీప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 
 
అయితే, ఈ ప్రాజెక్టు తెలుగులో చిరంజీవి చేయనున్నారనే వార్త లీకైనప్పటి నుంచి ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో హీరో చెల్లి పాత్ర అత్యంత కీలకం. తమిళంలో హీరో అజిత్ చెల్లిగా లక్ష్మీ మీనన్ నటించి మెప్పించి, మంచి మార్కులు కొట్టేసింది. 
 
ఇపుడు తెలుగులో ఈ పాత్రలో ఎవరు నటిస్తారన్న అంశంపై తెగ చర్చ సాగుతోంది. ముఖ్యంగా, చిరంజీవి సోద‌రిగా సాయిప‌ల్ల‌వి న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా మ‌రో పేరు తైర‌పైకి వ‌చ్చింది. చిరు సిస్ట‌ర్ పాత్ర‌లో కీర్తిసురేశ్ పేరును కూడా మేక‌ర్స్ ప‌రిశీలిస్తున్నార‌ట‌. 
 
తమిళ వెర్షన్‌లో ల‌క్ష్మీ మీన‌న్ ప్రేక్ష‌కులను మెప్పించింది. దీంతో ల‌క్ష్మీమీన‌న్ రోల్‌లో అవార్డు విన్నింగ్ హీరోయిన్లైన సాయిప‌ల్ల‌వి, కీర్తిసురేశ్‌ల‌లో ఎవ‌రిని  చిరు అండ్ టీం ఎంపిక చేస్తార‌నేది తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాలి. ప్రస్తుత ఈ చిత్రాన్ని నటీనటుల ఎంపికపై దర్శకుడు మెహర్ రమేష్ కసరత్తు చేస్తున్నారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు