చిరు చెల్లిగా సాయి పల్లవి పేరు ఖరారు!!

ఆదివారం, 11 అక్టోబరు 2020 (17:33 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ నిర్మిస్తుంటే, హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌తో పాటు మరో ఇద్దరు నటిస్తున్నారు. 
 
ఈ చిత్రం తర్వాత తమిళ చిత్రం "వేదాళం" చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. అలాగే, మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ష‌న్‌లో చిరంజీవి ఈ సినిమా చేస్తున్నాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా షురూ అయిన‌ట్టు స‌మాచారం‌.
 
సీరియ‌స్ ఫ్యామిలీ డ్రామా నేప‌థ్యంలో రానుంది. ఇందులో హీరో చెల్లి పాత్ర అత్యంత కీలకం. దీంతో సాయి పల్లవి పేరును ఖరారు చేశారు. కాగా, సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతిత‌క్కువ కాలంలోనే మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్టులో న‌టించే అవ‌కాశం కొట్టేసింది సాయిప‌ల్ల‌వి.
 
కాగా, ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ నిర్మిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు