టాలీవుడ్‌లో చిరు - మోహన్ బాబు బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకోగానీ తర్వాత వీరిద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. టాలీవుడ్ పండగ వజ్రోత్సవాల వేళ చిరుపై మోహన్ బాబు ఫైర్ పెద్ద చిచ్చు రేపింది. టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన నటనలోనే కాదు, తన ప్రవర్తన విషయంలో కూడా చాలా విలక్షణంగా ఉంటాడు. అటువంటి మోహన్ బాబు ఓ ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు చిరంజీవికి మధ్య ఉన్న స్నేహబంధం సీక్రెట్ చెప్పాడు.
తానూ చిరంజీవి పరిశ్రమలో మంచి స్నేహితులమని అయితే తెలుగు సినిమా వజ్రోత్సవాల సందర్భంగా కొంతమంది థర్డ్ గ్రేడ్ ఫెలోస్ తనకు చిరంజీవి మధ్య ఉన్న స్నేహ బంధం చూసి తట్టుకోలేక తమ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించారు. అయితే తానూ ఎప్పుడు చిరంజీవికి చెడు చేయలేదని అలాగే అతను తనకి చెడు చేయలేదని, తమ పక్కన ఉన్న వాళ్ళే చెడు చేయాలనీ ప్రయత్నించారని దానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారని అన్నారు.
ఇదిలావుంటే... మోహన్ బాబు నటుడిగా 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని .. టి. సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలోని 'లలిత కళా పరిషత్' మోహన్ బాబుకి 'నవరస నట తిలకం' పురస్కారాన్ని అందించనుంది. వైజాగ్‌లోని మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 17వ తేదీన ఈ వేడుక ఘనంగా జరగనుంది. ఈ వేడుకకి చిరంజీవితో పాటు దాసరి నారాయణరావు, నాగార్జున, విక్టరీ వెంకటేశ్ తదితరులు హాజరు కానున్నారు. చిరంజీవికి 'ఖైదీ నెంబర్ 150' షూటింగ్ ఉన్నప్పటికీ, మోహన్ బాబు కోసం ఆయన తీరిక చేసుకుంటున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య మళ్లీ అనుబంధం చిగురిస్తుందని సినీనిపుణులు అంటున్నారు.