నచ్చిన మగాడితో డేటింగ్ చేయడం, వీలుపడితే సహజీవనం చేయడం ఇపుడు ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. ఈ కోవలో యువతీ యువకులే కాదు.. సెలెబ్రిటీలు సైతం ఉన్నారు. అలాంటి వారిలో యామీ గౌతమ్ ఒకరు. ఆ మధ్యకాలంలో అల్లు శిరీష్ చిత్రం 'గౌరవం' ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్. తెలుగులో పెద్దగా క్లిక్ కాలేదు కానీ, బాలీవుడ్‌లో అడపాతడపా సినిమాలు చేస్తూ ఫాంలోనే ఉంది.
ఇటీవల బాలీవుడ్ హీరోతో సీక్రెట్‌గా కాపురం పెట్టేసిందన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. 'సనమ్ రే'లో పుల్కిత్ సామ్రాట్, యామీ జంటగా నటించారు. సినిమాల్లో ప్రేమ సన్నివేశాల్లో నటించే సమయంలోనే వీరిద్దరి మధ్య రియల్ ప్రేమ మొదలైందట. ప్రేమించుకోవడంతోనే ఆగిపోకుండా ముంబైలో ఓ ఫ్లాట్‌లో ఏకంగా కొత్త కాపురమే పెట్టేశారట. దీనిపై పుల్కిత్ మాత్రం స్పందించినప్పటికీ.. యామీ మాత్రం పెదవి విప్పడంలేదు. దీంతో సీక్రెట్ కాపురం నిజమేనేమో? అన్న అనుమానాలు బాలీవుడ్‌లో వ్యక్తం అవుతున్నాయి.