తాజాగా యంగ్ దర్శకుడు ఓ కథను తీసుకువచ్చి నిర్మాతలకు చెప్పారట. అయితే అది హారో బేస్డ్ కాకుండా హీరోయిన్ బేస్డ్ చేయమని సూచించారు. దానితోపాటు ఘాటి సినిమా విజయంపై నెక్ట్స్ అవకాశం వుంటుందని వెల్లడించారట. మరి అనుష్క శెట్టి ఘాటి బ్రేక్ పడడం పట్ల అసలైన కారణాలు చెప్పకపోయినా సాంకేతికంగా కొద్ది మార్పులు చేయాల్సివుందని టాక్ వినిపిస్తోంది.
అనుష్క అభిమానులు కొత్త విడుదల తేదీ కాకపోయినా స్పష్టత కోసం అడుగుతూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు, అనుష్క, దర్శకుడు క్రిష్ లేదా UV క్రియేషన్స్ ఈ విషయమై ఏవిధంగానూ స్పందించలేదు. అభిమానులు తమ నిరీక్షణ వృధా కాకూడదని మరియు ఘాటి త్వరలో కొన్ని సానుకూల వార్తలతో తిరిగి వస్తుందని ఆశిస్తున్నారు. ఆ తర్వాత తదుపరి చిత్రం కన్ఫామ్ కానుందని తెలుస్తోంది.