తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్ హీరోలు ఎవరయ్యా అని అడిగితే ఠక్కున చెప్పే పేర్లు రెండు. అందులో ఒకటి ప్రభాస్ కాగా, మరొకటి నితిన్, నిఖిల్. వీరిలో నితిన్, నిఖిల్‌లకు పెళ్లి ఫిక్స్ అయిపోయింది. కరోనా లాక్డౌన్ లేకుండా ఉన్నట్టయితే గత నెలలోనే వీరిద్దరూ ఓ ఇంటివారు అయివుండేవారు. కానీ, లాక్డౌన్ కారణంగా వీరిద్దరి వివాహం వాయిదాపడింది. ఇపుడు లాక్‌డౌన్‌ను మరోమారు పొడగించడంతో నిఖిల్ తన వివాహాన్ని మరోమారు నిరవధికంగా వాయిదావేసుకున్నారు.
హీరో నిఖిల్ సిద్ధార్థ్‌కు కొన్నినెలల కిందట భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 3న నిశ్చితార్థం జరుగగా, అప్పటికే చైనాలో కరోనా బీభత్సం కొనసాగుతుంది. ఇక, నిఖిల్ ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా, అంతకుముందే లాక్డౌన్ రావడంతో ఆ పెళ్లి మే 14వ తేదీకి వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే తంతు!