యాంకర్ సుమకు అలాంటి మెసేజ్ లు వస్తుంటాయన్న రాజీవ్ కనకాల, వీడియో వైరల్

బుధవారం, 29 ఏప్రియల్ 2020 (12:05 IST)
ఈమధ్య కాలంలో పాపులర్ యాంకర్ సుమ గురించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. అదేమిటంటే.. సుమ భర్త రాజీవ్ కనకాల, సుమ విడివిడిగా వుంటున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇరువురూ ఇప్పటివరకూ స్పందించలేదు. ఇదిలావుంటే ఇపుడు యూ ట్యూబులో వారికి సంబంధించిన ఓ పాత వీడియో హల్చల్ చేస్తోంది. 
 
ఈ జంట ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలవి. ఇందులో సుమకి వచ్చే లవ్ అండ్ మ్యారేజ్ ప్రపోజల్స్‌పైన సుమ భర్త రాజీవ్ కనకాల మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారంటే... ''సుమకి మామూలు క్రేజ్ లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ ఆమెకు ఐ లవ్ యూ, పెళ్లి చేసుకుంటానంటూ చాలా మెసేజ్‌లు పెడుతుంటారు. నువ్ ఇప్పుడు ఊ అను ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటా, రాజీవ్ నువ్ లక్కీ'' అనే మెసేజ్‌లు పెడతారు అని తన భార్య సుమ గురించి చెప్పారు రాజీవ్.
 
ఆ తర్వాత సుమ మాట్లాడుతూ... ఆ మెసేజ్‌ల సంగతి నాకు తెలియదు కానీ నాకు మాత్రం పిల్లోడు అన్నం తినడం లేదు, ఒకసారి మిమ్మల్ని చూపించమన్నాడు, మా అత్తగారికి చాలా సీరియస్‌గా ఉంది వంటి సందేశాలు చాలానే వస్తుంటాయి అని చెప్పారు. ఐతే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి వుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు