ఈనేపథ్యంలో టీవీలో వస్తున్న ఓ కార్యక్రమం ప్రోమోలో పేరు చెప్పకుండా ఓ హీరో తనకు క్షమాపణలు చెప్పాలని అనడం బాలీవుడ్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రోమోలో కంగనా ఏమన్నదంటే....`అతన్ని ఇక్కడికి పిలవండి. ప్రతి ప్రశ్నను అతన్ని అడగండి. మొదట నోటీసు పంపింది నేను కాదు. అంత నీతిమాలిన పని నేను చేయలేదు.
ఆ నోటీసు వల్ల రాత్రిళ్లు నాకు నిద్రపట్టేది కాదు. ఒత్తిడి, మానసిక వేదన వల్ల ఎంతో నరకయాతన అనుభవించాను. నా పేరు మీద అతను మెయిల్స్ కూడా విడుదల చేశాడు. ఇప్పటికీ వాటిని గూగుల్ చేసి మరీ జనాలు చదివి, నా మీద జోకులు వేస్తున్నారు. నన్ను ఇంత ఇబ్బందికి గురి చేసినందుకు అతను నాకు క్షమాపణలు చెప్పాలి` అంటూ డిమాండ్ చేసింది.