నా పెళ్లి.. నా యిష్టం.. నేనెప్పుడైనా చేసుకుంటా... మీకు చెప్పాలా?: సల్మాన్ ఖాన్

శనివారం, 21 మే 2016 (10:31 IST)
బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి చాలా కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొంతకాలంగా సల్మాన్ ఖాన్ విదేశీ భామ లూలియాతో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని, ఆమెనే వివాహం చేసుకోబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. కాగా ఈ సంవత్సరం డిసెంబర్ 27న వివాహం చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. 
 
శుక్రవారం జరిగిన ఐఫా అవార్డులకు సంబంధించిన సమావేశంలో సల్మాన్ మీడియాతో మాట్లాడుతూ ''నాకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు చేసుకుంటాను. నేను పెళ్లి చేసుకుంటున్న విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు'' అని మండిపడ్డాడు. నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఫేస్ బుక్‌లో పోస్ట్ చేస్తాను.. ఆ విషయాన్నీ నా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటానని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి