DCM రక్షణ బిల్లు ఎవరికోసం.. ఆ భాష ఏంటండీ బాబూ.. చదవలేకపోతున్నాను.. శ్యామల (video)

సెల్వి

సోమవారం, 18 నవంబరు 2024 (19:40 IST)
Shyamala
వైకాపా నేత శ్యామల సోషల్ మీడియాలో తాను ఎదుర్కొన్న సమస్యలను ప్రెస్ మీట్ ద్వారా పేర్కొన్నారు. తనకు ఫోన్ ద్వారా వచ్చిన వేధింపులను కళ్లకు గట్టినట్లు ప్రెస్ మీట్‌లో చూపెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియా దుర్వినియోగ రక్షణ బిల్లును తీసుకువస్తామని చెప్పారు. ఇది ఎవరి కోసం అంటూ ప్రశ్నించారు. 
 
ఇక సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన ఈ పీపీఎల్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని యాంకర్ శ్యామల ప్రశ్నించారు. చౌకబారుగా సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన వీరిని ఏం చేయాలని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో తన నెంబర్‌, వ్యక్తిగత వివరాలను పంచుకున్నారని వాపోయారు. ఫోన్ చేసి రేటు ఎంత అంటూ అడుగుతున్నారని, వాడరాని భాష వాడుతున్నారని.. ఎంతగా దిగజారుతున్నారని శ్యామల అన్నారు. 
 
ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఎంతో మంది తనకు దాదాపు 900 కాల్స్ చేస్తూ విసుగు తెప్పించారు. అంతేగాకుండా తన కుటుంబం, తన భర్తను కూడా కేవలమైన దిగజారుడు మాటలతో కామెంట్లు చేస్తున్నారు. ఫోన్ తీయాలని వేధిస్తున్నారు. 
 
ఇలా ఒక్కసారిగా ఐక్యంగా తనపై వేధింపులకు పాల్పడుతున్న వారు నేరాలు చేసే వారిని అదుపులోకి తీసుకునే అంశంపై ఒక్కటైతే బాగుంటుందని.. అలా చేసి వుంటే ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగేవి కావని.. అనేకమంది తల్లులకు కడుపుకోత మిగిలేదన్నారు. 
 
ఈ వ్యవహారంపై ఏపీలోని కూటమి సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. నారా లోకేష్ గారి యువగళం స్ఫూర్తిగా తీసుకుని ఈ పోస్టులు, కాల్స్ వస్తున్నాయని ఆరోపించారు. 

DCM says that they bring Social media abuse protection bill !

For whom ?

Why no action on these PPL who abused @AreSyamala cheaply and shared her personal details to abuse !

pic.twitter.com/5t6VCRdhNa

— సాయి రెడ్డి (@ysj_sai) November 18, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు