ఇలియానా 'బెటర్ హాఫ్' అని ట్వీట్ చేసింది.. నీబోస్‌తో పెళ్లైపోయినట్టేనా?

బుధవారం, 25 అక్టోబరు 2017 (14:36 IST)
టాలీవుడ్ నుంచి బాలీవుడ‌కు మకాం మార్చిన ఇలియానా ఆస్ట్రేలియా ఫోటో గ్రాఫర్ ఆండ్రూ నీబోస్‌తో రిలేషన్‌లో వున్న సంగతి తెలిసిందే. అయితే ఇలియానా తన ప్రియుడిని రహస్యంగా వివాహం చేసుకుందని వార్తలొచ్చిన నేపథ్యంలో.. తాజాగా ఇల్లీ బ్యూటీ పోస్టు చర్చకు దారితీసింది. తాను నీబోస్‌తో రిలేషన్‌లో వున్నానని చెప్తూ వచ్చిన ఇలియానీ.. పెళ్లి ముఖ్యం కాదని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. 
 
తాజా పోస్టు ద్వారా ఇలియానాకు నీబోస్‌కు వివాహం జరిగినట్లు తెలియజేస్తోంది. ఇలియానా తన ట్విట్టర్ ఖాతాలో మిమ్మల్ని నవ్వించే ప్రేమించే స్నేహితులను వెతుక్కోండంటూ ఓ ఫోటోను పోస్టు చేసింది. ఆ ఫోటో క్రెడిట్‌ను తన బెటర్ హాప్ అని పేర్కొంటూ ఆండ్రూ నీబోన్‌కు ఇచ్చింది. దీంతో ఇది వైరల్‌గా మారింది. సాధారణంగా బెటర్ హాఫ్ అనే పదాన్ని భార్యాభర్తలు మాత్రమే వాడుతారు. 
 
ప్రేమికులు, స్నేహితులు వాడరు. ఇలియానా తన ప్రియుడ్ని రహస్యంగా పెళ్లి చేసుకుందని ఆమె ట్వీటును బట్టి తెలుస్తోంది. దీనిని బట్టి ఇలియామా ఆండ్రూతో పెళ్లిచేసుకుని రిలేషన్‌లో వుందని ఖాయమైపోయిందని సినీ పండితులు ఓ నిర్ణయానికి వచ్చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు