ఇప్పటికే తెలుగులో స్టార్ హీరో రానా వెబ్ సిరిస్‌లోకి వచ్చి విజయం సాధించారు. నాగబాబు కుమార్తె నీహారిక.. ముద్దపప్పు, ఆవకాయ వెబ్ సీరిస్‌తోనే వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ చిన్నా చితకా హీరోలు సైతం ఈ వెబ్ ప్రపంచంలో అడుగు పెట్టారు.
ఇదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీవీ ప్రపంచంలోకి బిగ్ బాస్ ద్వారా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. వెబ్ సిరీస్ ద్వారా యూత్‌కు బాగా కనెక్ట్ కావొచ్చునని భావిస్తున్నారు. ముఖ్యంగా హిందీలో నవాజుద్దీన్ సిద్దిఖి, సైఫ్ అలీ ఖాన్, మనోజ్ వాజ్ పేయి, మాధవన్ వంటివారు వెబ్ ప్రపంపంలోకి అడుగుపెట్టడం ఎన్టీఆర్‌ని ప్రేరేపించిందట.