లక్ష్మీ రాయ్‌ను ముక్కలు చేసేశారు...

ఆదివారం, 4 నవంబరు 2018 (15:39 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నంబర్ 150. ఈ చిత్రంలో 'ర‌త్తాలు ర‌త్తాలు' అంటూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించిన బ్యూటీ లక్ష్మీ రాయ్. ఇపుడు మళ్లీ చాలా రోజుల త‌ర్వాత మరోసారి వెండితెరపై కనువిందు చేసేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 
 
'వేర్ ఈజ్ ది వెంక‌ట‌ల‌క్ష్మి' అంటూ గ్రామీణ నేపథ్యంలో విభిన్న కథాంశంతో థియేటర్స్‌లో సందడి చేసేందుకు సిద్దమయ్యింది. నూతన దర్శకుడు కిషోర్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను కలగలిపి అన్ని హంగులతో ఈ సినిమా ఉండనుందట.
 
దీపావళి కానుకగా తాజాగా హీరో నితిన్ చేతుల మీదుగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ బయటకు వదిలారు. ఈ పోస్టర్‌లో రాయ్ లక్ష్మిని రెండు ముక్కలుగా కట్ చేసి చూపించి సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఈ ఫస్ట్‌లుక్ బయటకు వదిలిన నితిన్.. చిత్ర యూనిట్‌కి బెస్ట్ విషెస్ తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు