రోహిత్, నాగ‌శౌర్య‌ల జో అచ్యుతానంద‌..

గురువారం, 18 ఆగస్టు 2016 (14:21 IST)
''సుబ్రమణ్యం ఫర్ సేల్'' చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ రెజీనా ప్రస్తుతం తెలుగులో ''జో అచ్యుతానంద'' అనే సినిమాలో నటిస్తుంది. ట్రైయాంగిల్ ల‌వ్‌స్టోరీతో సాగుతున్న ఈ చిత్రంలో నారా రోహిత్‌, నాగ‌శౌర్యలు హీరోలుగా నటిస్తున్నారు. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకుడిగా మారిన అవసరాల శ్రీనివాస్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 
 
వారాహి చలన చిత్రం పతాకంపై శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఆ ఇద్దరు హీరోలు ఒక అమ్మాయిని వెంట‌ప‌డుతూ.. ఇబ్బందిపెట్టే విధంగా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో నారా రోహిత్‌, శౌర్య అన్నద‌మ్ములుగా న‌టిస్తున్నారు.
 
 జ్యో (రెజీనా)ను త‌న ప్రేమకు బానిస చేసుకుంటామ‌ని ఈ ఇద్దరు హీరోలు స‌వాల్ విసురుకుంటారు. తాజాగా రిలీజైన జో అచ్యుతానంద మూవీ టీజర్ గురించి నిర్మాత మాట్లాడుతూ...ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిల మధ్య నడిచిన అందమైన ప్రేమ కథ ఇది. అనవసరమైన ఫైట్లూ, గందరగోళం లేకుండా ఈ మూవీకి ఆహ్లాదకరమైన టైటిల్ పెట్టామని సాయి కొర్రపాటి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి