బాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఉన్న బోల్డ్ హీరోయిన్లలో కంగనా రనౌత్ ఒకరు. ఈమె తన మనసులోని భావాలను ఏమాత్రం దాచుకోకుండా వ్యక్తీకరిస్తుంది. పైగా, ఆమె చేయదలచుకున్న పనిని చేసితీరుతుంది. చెప్పదలచుకున్న మాటను చెప్పితీరుతుంది. ఎవరికీ భయపడదు. అందుకే ఈమెకు బాలీవుడ్ బోల్డ్ క్వీన్ అని పేరువచ్చింది.
ముఖ్యంగా, "ఎవరినైనా ఇష్టపడి డేటింగ్‌కు వెళుతుంటాను. అలా క్యాజువల్‌గా డేట్‌కు వెళ్లినా వారి బెడ్‌పై ఎక్కువసేపు ఉండలేను. ఏ అర్థరాత్రో లేచి నా బెడ్ మీదకు వెళ్లిపోతాను. నేను ఇండిపెండెన్స్‌కు బానిసగా మారిపోయాను. నాకు నచ్చినదే చేస్తాను. ఎంత పెద్దవారైనా నా చేత బలవంతంగా ఏ పనీ చేయించలేరు. ఈ స్వంతత్ర భావాలు నన్నెక్కడకు తీసుకెళ్తాయో' అని కంగనా చెప్పుకొచ్చింది.