సోషల్ మీడియాను కుదిపేస్తున్న ఈ వార్త త్వరలో నిజమయ్యే అవకాశం వున్నట్లు సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. కానీ ఈ వార్తలకు సంబంధించి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, ఈ ఇద్దరు తమ పెళ్లి తేదీని అతి త్వరలోనే అభిమానులకు, శ్రేయోభిలాషులకు వెల్లడిస్తారని టాక్ వస్తోంది.
ఇక అనిరుధ్ విషయానికి వస్తే.. ఆయన తెలుగులో నితిన్ అఆతో పాటు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసికి సంగీతం అందించాడు. వీటితో పాటు విక్రమ్ కుమార్ నాని కాంబినేషన్‌లో వచ్చిన గ్యాంగ్ లీడర్‌కు కూడా మంచి మ్యూజిగ్ ఇచ్చి ఇక్కడ కూడా పాపులర్ అయ్యాడు. ఇక ఆయన లేటెస్ట్‌గా విజయ్ మాస్టర్‌కు సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా ఇటు తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా మంచి విజయాన్ని అందుకుంది.