మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్ర "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం జనవరి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమం శనివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్.. ఖైదీ చిత్రానికి మాతృక అయి తమిళ 'కత్తి' సినిమా ట్రైలర్‌ను అచ్చుగుద్దినట్టు ఉందనే విమర్శలు వచ్చాయి. అయితే, వీటన్నింటిని కాదనీ ఈ ట్రేలర్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డునే సృష్టిస్తోంది.
థ్రియేట్రికల్ ట్రైలర్‌లో యాక్షన్‌తో నింపేశాడు. మెగాస్టార్ డైలాగ్స్‌తో ఇరగదీశాడు. మొత్తంగా మాస్ ప్రేక్షకులని ఫుల్లుగా అలరించేలా సాగింది ట్రైలర్. ఇదే విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చెప్పడం విశేషం. మెగా ఖైదీలో యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ.. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు.
అందుకే.. అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టేందుకు 'కత్తి' రిమేక్‌ని ఎంచుకొన్నట్టు తెలిపారు. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్‌తో సత్తాచాటాడు మెగా ఖైదీ. ఇక, ఈ నెల 11న సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన తర్వాత ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయన్నది చూడాలి.