బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తమిళ నటుడు ధనుష్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకారు వెలువడిన నేపథ్యంలో.. మృణాల్ నోరు విప్పింది. "ధనుష్ నాకు మంచి స్నేహితుడు, సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్ సమయంలో దీనిని తప్పుగా అర్థం చేసుకున్నారు. అజయ్ దేవగన్ ఈ సినిమా ప్రీమియర్ షో కోసం ధనుష్‌ను ఆహ్వానించారు.." అని చెప్పుకొచ్చింది. దీనికి ముందు, మృణాల్ ఠాకూర్ ధనుష్ బాలీవుడ్ చిత్రం తేరే ఇష్క్ మే పార్టీకి హాజరయ్యారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ధనుష్ సోదరీమణులను అనుసరించడం ప్రారంభించిన తర్వాత మృణాల్ ఈ పుకార్లకు బలం చేకూర్చింది. 18 సంవత్సరాల వివాహం తర్వాత ధనుష్ తన భార్య ఐశ్వర్య రజనీకాంత్‌తో విడిపోయాడు. ప్రస్తుతం సింగిల్‌గా వున్నాడు. ఈ నేపథ్యంలో ధనుష్ సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్ షోలో ధనుష్, మృణాల్ కలిసి కనిపించిన తర్వాత పుకార్లు చక్కర్లు కొట్టాడు.
మృణాల్ ఠాకూర్, ధనుష్ ప్రేమలో వున్నారనే పుకార్లకు దారితీసింది. ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన అంశంగా మారింది. దీనిపై మృణాల్ క్లారిటీ ఇచ్చింది. ధనుశ్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని, అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని ఆమె స్పష్టం చేసింది. ఈ పుకార్లన్నీ నిరాధారమైనవని మృణాల్ కొట్టిపారేసింది.