టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత-నాగచైతన్యలు త్వరలో దంపతులు కానున్నారు. సమంతకు సామాజిక సేవ చేయడం అంటే చాలా ఇష్టం. అలాగే నాగచైతన్యకు కార్లు కొనడం అంటే ఇష్టం. కార్ల మోడల్స్ గురించి అప్పుడప్పుడు చైతూ ఆరా తీస్తుంటాడు. తాజాగా చైతూ గ్యారేజ్‌లోకి కొత్త కారొచ్చి చేరింది. ఈ కారును చైతూకు కాబోయే భార్య సమంత బహుమతిగా ఇచ్చిందట.
ఏప్రిల్ 28న పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న సమంత.. ఈ సందర్భంగా తన ప్రియునికి బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ లేటెస్ట్ మోడల్ కారును బుక్ చేసిందట. ఈ కారు ధర దాదాపు కోటిన్నర ఉంటుందని సమాచారం. అలాగే పుట్టినరోజు సందర్భంగా సమంత చిన్నారులను తీసుకెళ్లింది. కానీ రికార్డులు, కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న 'బాహుబలి: ది కన్ క్లూజన్' సినిమాకు వెళ్లిన సమంత.. పట్టుమని అరగంట కూడా సినిమా చూడకుండానే బయటకు వచ్చేసిందట.