అవినాష్‌కు నాగబాబు ఫోన్, ఆ మాట చెప్పగానే కన్నీళ్ళు?

సోమవారం, 9 నవంబరు 2020 (21:22 IST)
జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి బిగ్ బాస్ 4షోలో కొనసాగుతున్నాడు ముక్కు అవినాష్. ప్రతిసారి ఏదో ఒకటి చెబుతూ తన సమస్యను వివరిస్తూ బిగ్ బాస్ 4లో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ముక్కు అవినాష్. ఒకానొక దశలో జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి తాను 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సి వచ్చిందని కూడా చెప్పుకొచ్చాడు అవినాష్.
 
మొత్తానికి ఎలాగోలా బయటకు వచ్చాను.. కానీ బిగ్ బాస్ షో నుంచి బయటకు వెళితే తన పరిస్థితి ఏంటో తనకే అర్థం కాలేదంటున్నాడు అవినాష్. తాను బయటకు వెళితే పరిస్థితి ఘోరంగా ఉండే అవకాశం ఉందంటున్నాడు అవినాష్.
 
అయితే బిగ్ బాస్ షోను ఫాలో అవుతున్న నాగబాబు ముక్కు అవినాష్‌కు స్వయంగా ఫోన్ చేశాడట. నువ్వు దేనికి ఆందోళన చెందొద్దు. ముందుగా భయపడడం మానుకో. నువ్వు బిగ్ బాస్ షో నుంచి బయటకు వస్తే నీకు అదిరింది షోలో అవకాశం ఇప్పించే బాధ్యత నాది అంటూ నాగబాబు హామీ ఇచ్చారట. దీంతో కొండంత ధైర్యమొచ్చిందంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడట అవినాష్. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు