బొమ్మాళీ నిన్ను వదల... నాగ్ పైన జోకులా...?

మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (19:43 IST)
బొమ్మాళీ నిన్ను వదల.. అంటూ చంద్రముఖిలో విలన్‌.. అనుష్కను ఎలా వదలడో రియల్‌లైఫ్‌లో నాగార్జున అనుష్కను వదలడంటూ.. ఫిలింనగర్‌లో జోకులు వేసుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. నాగార్జున నటించే చిత్రాల్లో ఏదో పాత్రలో అనుష్కను ఇన్‌వాల్వ్ చేస్తుంటాడు.'సూపర్‌'తో స్టార్టయినా వీరి కలయిక.. సూపర్‌గా సాగుతోందని తెలుస్తోంది. 
 
నాగార్జున సినిమా అంటే చాలు గెస్ట్‌గానే కాకుండా సాంగ్‌ చేయడానికైనా సిద్ధమేనని అనుష్క చెబుతోంది. తాజాగా నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో శ్రీవేంకటేశ్వర స్వామి చరిత్రపై చిత్రం రాబోతుంది. సెట్‌ పైకి వెళ్ళేముందు పాత్రల ఎంపిక పరిశీలన జరుగుతోంది. ఇందులో హథీరామ్‌ బావాజీగా నాగార్జున నటిస్తుండగా.. దేవునిగా సుమన్‌ కన్పించనున్నాడు. 
 
అలివేలుమంగ, పద్మావతి అమ్మవార్లుగా ఇద్దరు నటీమణుల్ని ఎంపిక చేయాల్సివుంది. ఒ క పేరును అనుష్కగా నాగ్‌ ప్రతిపాదించారని తెలిసింది. మరో పాత్ర కోసం రమ్యకృష్ణను ఎంపిక చేసే ఆలోచనలో వున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం లొకేషన్ల కోసం చిత్ర యూనిట్‌ నిమగ్నమైంది. జూన్‌లో సెట్‌పైకి వెళ్ళనుంది.

వెబ్దునియా పై చదవండి