నాని ప్రయోగం ఫలించేనా..?

గురువారం, 21 మే 2020 (21:16 IST)
నేచురల్ స్టార్ నాని నటించిన వి సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ... కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత నాని నిన్నుకోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే సినిమా చేయాలి. ఈపాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి కానీ.. కరోనా కారణంగా ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు.
 
ఇదిలా ఉంటే... ఇప్పుడు నాని కొత్త సినిమా గురించి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ మేటర్ ఏంటంటే... క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓడెల అనే కొత్త కుర్రాడు నానికి ఓ కథ చెప్పాడని.. ఆ కథ నానికి బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. సుకుమార్ వద్ద శ్రీకాంత్ రంగస్థలం చిత్రానికి దర్శకత్వ శాఖలో వర్క్ చేసాడు. 
 
కథ కొత్తగా, ఎంతో ఆసక్తికరంగా ఉండడంతో, వెంటనే మరో మాట లేకుండా ఆ ప్రాజక్టుకి ఓకే చెప్పేశాడని అంటున్నారు. అయితే... ఈ సినిమా రెగ్యులర్ సినిమాలా కాకుండా... డిఫరెంట్‌గా ఉంటుందని తెలిసింది. ఇంకా చెప్పాలంటే.. ఇది ఓ ప్రయోగాత్మక చిత్రం అంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ మూవీపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మరి... నాని చేస్తున్న ప్రయోగం ఫలిస్తుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు