నయనతార దెబ్బతో గుడ్లు తేలేసిన ప్రొడ్యూసర్, ఏమైంది? (video)

గురువారం, 21 నవంబరు 2019 (16:20 IST)
నయనతార.. ఎవ్వరి మాటా వినదు. ఆమె రూటే సెపరేటు. కాల్షీట్లు ఇస్తుంది. ఇచ్చినంతవరకే నటిస్తుంది. ఆ తర్వాత సినిమా ప్రమోషన్లు గట్రా అంటే అస్సలు పట్టించుకోదు. ఎవరెన్ని మాటలన్నా డోంట్ కేర్ అంటుంది. అంతెందుకు మెగాస్టార్ చిరంజీవి సైరా యూనిట్‌కే ఆమె చుక్కలు చూపించింది. అంతటి మొండిఘటం నయనతార.
 
ఇక అసలు విషయానికి వస్తే... నయనతార ప్రస్తుతం పారితోషికం రూ. 5 కోట్లు అని అనుకున్నారు కదా. కానీ నిన్ననే తన రేటు పెంచేసిందట. కోలీవుడ్ ప్రొడ్యూసర్ ఓ ప్రిస్టీజియస్ ప్రాజెక్టు తీసేందుకు నయనతారను సంప్రదించారట. చిత్ర కథంతా ఎంతో ఆసక్తి విన్న నయనతార, స్టోరీ సూపర్బ్ అని ఎగిరి గంతేసిందట. ఆ తర్వాతే అసలు కథ మొదలైందట. 
ఆ చిత్రంలో నటించాలంటే తనకు రూ. 8 కోట్లు పారితోషికంగా ఇవ్వాలంటూ కండిషన్ వేసిందిట. అదేంటమ్మా... మొన్నే కదా రూ. 5 కోట్లు అన్నారు, ఇప్పుడేంటి అకస్మాత్తుగా ఈ ఫిగర్ అని అడిగితే... అది మొన్నటి ఫిగర్, ఇది ఇవాల్టి ఫిగర్. నచ్చితే ఓకే చెయ్యండి లేదంటే మీ స్టోరీని ఇంకెవరికైనా చెప్పుకోండి అని లేచి వెళ్లిపోయిందట. అదీ సంగతి. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు