సినీ నటుడు రాజీవ్ కనకాల తన భార్య, యాంకర్ సుమ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ హీరోయిన్లను మించి సుమ పారితోషికం తీసుకుంటుందని ప్రచారం చేయడంలో అర్థం లేదన్నాడు. కాకపోతే ఆమె లక్షల్లో తీసుకుంటుందని చెప్పాడు. కానీ ఎన్ని లక్షలు తీసుకుంటుందనేది మాత్రం తెలియదని రాజీవ్ కనకాల వ్యాఖ్యానించాడు.
ఇంత చేసినా కూడా మీరు ఊహించుకునేంత రెమ్యునరేషన్ ఏముండదని రాజీవ్ చెప్తున్నాడు. ఎప్పుడూ తన సంపాదన గురించి అడగలేదని.. ఆమె స్పేస్ ఆమెకే వదిలేస్తానంటున్నాడు రాజీవ్ కనకాల. మొత్తానికి సుమ కనకాల విజయం వెనక మాత్రం ఆమె కష్టం తప్ప మరేం లేదంటున్నాడు ఈయన. భర్తగా తాను చేయాల్సిన సపోర్ట్ చేస్తాను కానీ ఆమె కెరీర్ విషయంలో వేలు పెట్టనంటున్నాడు ఈ నటుడు. తాజాగా మహర్షి సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.