కమల్ - పూజా కుమార్ లవ్ ఎఫైరా? ఆ వేడి సన్నివేశాలే దగ్గర చేశాయా?

శనివారం, 9 నవంబరు 2019 (16:45 IST)
విశ్వ నటుడు కమల్ హాసన్ మరోసారి ఘాటు వార్తల్లోకి వచ్చేశాడు. తమిళ ఇండస్ట్రీలో ముద్దుల వీరుడుగా చెప్పుకునే కమల్ హాసన్ సినీ జీవితంలో ఎంతటి స్టారో వేరే చెప్పక్కర్లేదు. కానీ ఈ స్టార్ నిజ జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా వైవాహిక జీవితానికి సంబంధించి విడాకులు, బ్రేకప్పులు మామూలయ్యాయి. 
 
ఇక అసలు విషయానికి వస్తే... కమల్ హాసన్ తన 65 వ పుట్టినరోజును తన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. ఆ సమయంలో కమల్ కుటుంబంతో పాటు నటి పూజా కుమార్ కనిపించింది. అంతేకాదు, అక్కడి ఏర్పాట్లన్నీ తనే స్వయంగా చేస్తున్నట్లు కనిపించింది. దీనితో మళ్లీ చర్చ మొదలైంది. పూజా కుమార్ - కమల్ హాసన్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ వార్తలు వచ్చేశాయి.
 
ఇలాంటి వార్త వస్తే వదిలిపెడతారా? ఆమెను ఇటీవలి ఇంటర్వ్యూలో దీని గురించి అడిగితే, "నేను గత 5 సంవత్సరాలుగా కమల్‌తో కలిసి పని చేస్తున్నాను. అతనిలాంటి గొప్ప క్రియేటర్ ఎవ్వరూ వుండరు. ఆయన ఓ మెస్మరైజర్.
 
అతను ఏదైనా చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు. ఓపికపట్టడం ఎలాగో నాకు నేర్పించింది ఆయనే. ఏదేమైనా, అతని వైఖరి అద్భుతమైనది. ఆయన నుంచి నేను చాలా నేర్చుకుంటున్నా అంటూ చెప్పింది. కోలీవుడ్ సినీజనం మాత్రం పూజా కుమార్ తో ఆమధ్య కమల్ నటించిన ఓ చిత్రంలో వేడి సన్నివేశాలున్నాయి. అక్కడ నుంచి వీరిమద్ధ క్లోజ్‌నెస్ పెరిగిపోయిందనీ, ఇద్దరూ రిలేషన్లో వున్నారంటూ చెప్పుకుంటున్నారు. మరి దీనిపై లోకనాయకుడు ఏమంటారో?

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు