ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళ, మళయాల ఇండస్ట్రీల్లో కూడా నయనతార పెళ్లిపై వార్తలు బాగానే వినిపిస్తున్నాయి. నయన్ పెళ్లి టాపిక్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లవుతున్నా కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతుంది. ఇంకా చెప్పాలంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ నెంబర్ వన్ హీరోయిన్ ఈమే.
దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో కథానాయిక నయనతార ప్రేమ ముదిరి పెళ్లి పీటలు ఎక్కనుంది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట, డిసెంబరులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇరు కుటుంబాల అంగీకారంతోనే త్వరలోనే ఈ జంట అఫీషియల్ జోడీ కావడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. పైగా, వీరి వివాహం ఇండియాలో కాకుండా విదేశాల్లో జరుగుతుందని కోలీవుడ్ సమాచారం.