ముఖ్యంగా ఇటువంటి చిత్రాలకు కాస్ట్యూమ్స్ ముఖ్య పాత్రను వహిస్తుంది. ఈ చిత్రం కోసం ఒక ప్రత్యేక డిజైనర్‌ను కూడా ఎంపిక చేశారు. గతంలో ''దేవదాస్'', ''జోథా అక్బర్'' వంటి చిత్రాలకు పనిచేసి, ఇండియాలో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్, మూడు జాతీయ అవార్డుల విజేత నీతూ లుల్లాని ఇప్పుడు 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాకు డిజైనర్‌గా దర్శకుడు క్రిష్ సెలక్ట్ చేశారు. దాదాపు 300 సినిమాలకు డిజైనర్‌గా పనిచేసిన ఘనత ఈమెకుంది.
''గౌతమీపుత్ర శాతకర్ణి'' సినిమా కోసం నీతూ దర్శకుడు క్రిష్ , కెమెరామెన్ జ్ఞానశేఖర్, ఆర్ట్ విభాగంతో కలిసి సన్నివేశాలకు తగిన విధంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. శాతావాహనుల కాలానికి చెందిన సంస్కృతి, సంప్రదాయాలపై యూనిట్ సభ్యులు స్టడీ చేస్తున్నారు.