నా ఒళ్ళు నా ఇష్టం అంటున్న నిత్యామీనన్ (Video)

సోమవారం, 6 జులై 2020 (21:30 IST)
హీరోయిన్లలో నిత్యామీనన్‌కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది. అయితే తన శరీరం బరువు విషయంలో మాత్రం ఇప్పటికీ నిత్యామీనన్ విమర్సలు ఎదుర్కొంటోంది.
 
పలువురు నెటిజన్లు ఆమెపై విమర్సలు చేస్తున్నారట. మన కంటే లావుగా ఉండే వారి నుంచి విమర్సలు ఎదురవ్వవనీ, మనకంటే సన్నగా ఉండే వాళ్ల నుంచే విమర్సలు ఎదురవుతాయని నిత్య చెబుతోంది. 
 
అసలు బరువు ఎందుకు పెరుగుతున్నావని ఎవ్వరూ ప్రశ్నించరని, వాస్తవానికి ఎవరికి వారు ఊహించుకుంటూ ఉంటారని, ఏదో అనారోగ్య సమస్యలు వచ్చేశాయంటూ చెప్పుకుంటూ ఉంటారంటోంది నిత్యామీనన్.
 
తన బరువు గురించి విమర్సలు ఎదుర్కొన్నప్పుడు తాను ఎవరినీ ఎదురు ప్రశ్నించలేదని, బాధపడలేదని తెలిపింది. ఇలాంటి వన్నీ చిన్న విషయాలను చెబుతోంది నిత్యామీనన్. ఇలాంటి వాటిని ఎవరికి వారే అధిగమించాలంటోంది నిత్య. 
 
ఇండస్ట్రీ వ్యక్తులు తనను చూస్తున్నారా, తన బరువును చూస్తున్నారా అనేది తనకు ముఖ్యమనే విషయాన్ని తాను అస్సలు పట్టించుకోనంటోంది నిత్యామీనన్. తన పని తాను చూసుకుంటూ పోతానంటోంది నిత్య. 
 
అయితే కరోనా సమయంలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు అనవసరంగా పనిగట్టుకుని తన బరువుపై కొంతమంది విమర్సలు చేయడం మాత్రం కాస్త బాధ అనిపించిందని, నా ఒళ్ళు నా ఇష్టమంటోంది నిత్యామీనన్.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు