పెద్దగా హైట్ లేకున్నా తన ముఖ కవళికలతోనే హీరోయిన్‌గా రాణించేస్తోంది నిత్యామీనన్. 2005 సంవత్సరంలో కన్నడ సినిమాల్లో మొదటగా నటించిన నిత్యామీనన్ ఆ తరువాత మళయాళం, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ వచ్చింది. 40కి పైగా సినిమాల్లో నటించిన నిత్యా మీనన్‌కు అవార్డులు బాగానే వచ్చాయి. కానీ ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేకపోవడంతో నిత్యామీనన్ బాగా ఇబ్బంది పడుతోంది.
తమిళంలో తాజాగా మెర్సల్ సినిమాలో నిత్యామీనన్ నటించారు. భారీ హిట్ ఆ చిత్రం ద్వారా నిత్యామీనన్‌కు లభించింది. కానీ నిత్యకు తెలుగులో నటించడమంటేనే చాలా ఇష్టం. తెలుగు ప్రేక్షకులు నిత్యామీనన్‌ను బాగా ఆదరిస్తుండటంతో నిత్య తెలుగు సినిమాల వైపు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. కానీ ఇక్కడ అవకాశాలు మాత్రం రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు నిత్యామీనన్.