తాజాగా సాయిపల్లవి నటించిన పడి పడి లేచే మనస్సు సినిమా ఈ నెల 21వ తేదీన విడుదలైంది. ప్రారంభంలో భారీ కలెక్షన్లు వచ్చినా ఆ తరువాత సినిమా టాక్ విభిన్నంగా వినిపించింది. కొత్తదనం చూపించే క్రమంలో కంటెంట్ మిస్సయి కథ మొత్తం మారిపోయిందంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా మొత్తానికి సాయిపల్లవే స్పెషల్ ఎఫెక్ట్.
హీరో శర్వానంద్ కన్నా సాయిపల్లవిని చూసేందుకు ఎక్కువగా అభిమానులు థియేటర్లకు చేరుకుంటున్నారు. అయితే ఆ సినిమా కాస్తా నెగటివ్ టాక్ రావడంతో సాయిపల్లవితో సినిమా చేసేందుకు దర్సకులు ముందుకు రావడం లేదట. పడి పడి లేచే మనస్సు సినిమా సెట్స్ పైన ఉండగా సాయి పల్లవికి రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయట. అయితే ఒక సినిమా చేసేటప్పుడు మరో సినిమా సాయి పల్లవికి చేయడం ఇష్టం ఉండదు.
అందుకే ఆమె ఆ సినిమాను ఒప్పుకోలేదట. కానీ చేసిన సినిమా ప్రేక్షకులను మెప్పించకపోవడంతో సాయి పల్లవికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. చేతికొచ్చిన రెండు సినిమాలు ఆమె చేజారిపోయాయి. దర్సకులు సాయిపల్లవిని కాదని వేరే హీరోయిన్లను వెతుక్కుంటున్నారట. దీంతో సాయి పల్లవి కనిపిస్తే... అర్జెంట్ పని ఉంది మళ్ళీ కలుద్దామంటూ అక్కడి నుంచి మెల్లిగా జారుకుంటున్నారట. అయితే ఇదంతా సినీపరిశ్రమలో మామూలేనని లైట్ తీసుకుంటోందట సాయి పల్లవి. మరి సాయిపల్లవికి మళ్ళీ అదృష్టం ఎప్పుడు కలిసొస్తుందో వేచి చూడాలి.