పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో దూకుడు పెంచాడు. వరుస చిత్రాల్లో చేసేందుకు కమిట్ అయ్యారు. ఇప్పటికే ఆయన బాలీవుడ్ చిత్రం పింక్ రిమేక్‌ను 'వకీల్ సాబ్' పేరుతో నిర్మిస్తున్నారు. వేణూ శ్రీరామ్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్‌లు నిర్మిస్తున్నారు.
ఇదిలావుంటే, పవన్ మరో చిత్రంలో నటించేందుకు సమ్మతించాడు. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించే ఈ చిత్రం ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతున్నారు. పవన్ జన్మదినోత్సవం సందర్భంగా ఇటీవలె ఆ సినిమా గురించి ప్రకటన వచ్చింది.