ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభవార్త: కరెంట్ చార్జీలు తగ్గబోతున్నాయ్

ఐవీఆర్

సోమవారం, 29 సెప్టెంబరు 2025 (23:00 IST)
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు దసరా పండుగ సందర్భంగా కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరెంట్ చార్జీలలోని ట్రూ అప్ చార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకిటించింది. దీనితో ప్రజలపై సుమారుగా వెయ్యికోట్ల రూపాయల భారం తగ్గనుందని మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేసారు. 
 
ట్విట్టర్లో ఆయన పేర్కొంటూ... ప్రజా ప్రభుత్వం పవర్ ఏంటో మరోసారి రుజువైంది! ఎన్నికల ముందు ఇచ్చిన మరో మాటను నిలబెట్టుకున్నారు చంద్రబాబుగారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పిపిఏ రద్దు దగ్గర నుండి ట్రూ అప్ ఛార్జీల వరకూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ప్రజల్ని పీడించారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం వలన సుమారుగా ప్రజలపై వెయ్యి కోట్ల భారం తగ్గనుంది అని పేర్కొన్నారు. యూనిట్‌కు 15 పైసలు మేర చార్జీలు తగ్గిస్తున్నట్లు విద్యుత్ శాఖామంత్రి గొట్టిపాటి రవి వెల్లడించారు.

#PowerPayBackInAP
ప్రజా ప్రభుత్వం పవర్ ఏంటో మరోసారి రుజువైంది! ఎన్నికల ముందు ఇచ్చిన మరో మాటను నిలబెట్టుకున్నారు @ncbn గారు. గత ఐదేళ్ల వైసీపీ పాలన లో పిపిఏ రద్దు దగ్గర నుండి ట్రూ అప్ ఛార్జీల వరకూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ప్రజల్ని పీడించారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ట్రూ అప్… pic.twitter.com/VE9CnBBEg5

— Lokesh Nara (@naralokesh) September 29, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు