నా దరిద్రాన్ని అద్దంలో చూశానన్న రాశీ ఖన్నా, ఎలా సాధ్యం?

శుక్రవారం, 1 నవంబరు 2019 (17:26 IST)
రాశీ ఖన్నా.. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోయినా ఏమీ బాధపడడం లేదట. సినిమాలు లేకపోవడంతో ఆమె తన అభిమానులను కొన్ని సూచనలు చేస్తోంది. అది కూడా జీవిత సూక్తులు. రాశీ ఖన్నా ఒక్కసారిగా ఇలా మారిపోవడంతో అభిమానులే ఆశ్చర్యపోతున్నారట.
 
2018 సంవత్సరంలో నా చేతిలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం. ఇలా ఖాళీ లేకుండా సినిమాల్లో నటించాను. అయితే ప్రస్తుతం సినిమాలు లేవు. అయినా ఫర్లేదు. ఈ సంవత్సరం ఒకే ఒక్క సినిమాలతో అడ్జెస్ట్ అవుతాను. ఆ సినిమా త్వరలో విడుదలవబోతోంది.
 
నేను నార్త్ నుంచి వచ్చాను. తెలుగు, తమిళ భాషలను అనర్గళంగా మాట్లాడుతున్నానని చాలామంది నన్ను పొగిడిన వారు ఉన్నారు. అది నాకు సంతోషానిచ్చింది. అయితే నాకు సినిమా అవకాశాలు లేవని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అది ఏ మాత్రం నాకు ఇష్టం లేదు అంటోంది రాశీ ఖన్నా.
 
అంతేకాదు నేను ఎప్పుడూ ఏ విషయానికి బాధపడలేదు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్నదే నా తపన. సినిమా అవకాశాలు లేవని ఇంట్లో డీలా పడిపోయి కూర్చోలేదు. ఫ్రెండ్స్‌తో జాలీగా షికార్లు తిరుగుతున్నా. ఒక్కోసారి నా అదృష్టం, నా దురదృష్టం ఎలా ఉంటుందో చూసుకుంటానంటోంది రాశీ. అదే తన గదిలోని అద్దం ముందుకు వెళ్ళి తన ముఖాన్ని తానే చూసుకుంటుందట. ఈ బ్యూటీ స్వీట్ మెసేజ్ చదువుతున్న అభిమానులు రాశీఖన్నా సినిమాలు లేకపోవడంతో ఏదేదో మాట్లాడేస్తోందని గుసగుసలాడుకుంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు