కొరటాలతో చిరంజీవి సినిమా.. ముదురు హీరోయిన్‌ కన్ఫార్మ్

గురువారం, 31 అక్టోబరు 2019 (12:41 IST)
మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌లే సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాకు మంచి ప్ర‌శంస‌లు వచ్చి చేరాయి. ఇక చిరు నెక్ట్స్ సినిమాకు అప్పుడే రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టు ఫైనల్‌ వెర్షన్‌ జరుగుతోంది. 
 
ఈ సినిమాలో మెగా ఫ్యాన్సుకు అనుగుణంగా కమర్షియల్ హంగులు పుష్కలంగా వుంటాయని తెలుస్తోంది. హీరోయిజంతో పాటు అదిరిపోయే స్టెప్పులు, డైలాగుల‌తో పాటు మంచి సోష‌ల్ మెసేజ్ కూడా ఉంటుంద‌ట‌. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌న‌వ‌రి నుంచి ప్రారంభం కానుంది.
 
ముందుగా రామోజీ ఫిల్మ్‌సిటీలో 20 రోజుల పాటు షూటింగ్ చేసి ఆ త‌ర్వాత శ్రీకాకుళం జిల్లా ప‌లాస ప్రాంతంలో షూటింగ్ జ‌రుగుతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గురించి అదిరిపోయే అప్ డేట్ వచ్చేసింది. అదేంటంటే..? ముదురు హీరోయిన్ అయితేనే చిరు సరసన సరిపోతుందని సినీ యూనిట్ భావించిందట. 
 
అందుకే చిరు ప‌క్క‌న కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను హీరోయిన్‌గా దాదాపు ఫైన‌లైజ్ చేసిన‌ట్టు స‌మాచారం. చిరు ప‌క్క‌న కాజ‌ల్ ఇప్ప‌టికే ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. చిరు-కొరటాల కాంబోలో తెరకెక్కే ఈ సినిమా వేసవి కానుకగా విడుదల కానుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు